25 సంవత్సరాల తరువాత తరగతి ఆత్మీయ సమ్మేళనం
1995-96 పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణ వార్త పెన్ పహాడ్ మండలం 19 జనవరి :- పెన్ పహాడ్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96 పదవ తరగతి 25 సంవత్సరాల తర్వాత ఆత్మీయ అపూర్వ సమ్మేళన కార్యక్రమంను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు చిన్ననాటి స్నేహితుల తోటి జ్ఞాపకాలను పంచుకున్నారు ఉపాధ్యాయుడు అరుణ్ కుమార్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఒగ్గు సోమన్న, నంబి సతీష్,కట్టొజు హరీష్, ఎం వెంకటరెడ్డి, మద్దిమడుగు నరేందర్, ఒగ్గు రవికుమార్ పల్లపంగు విజయ్,భూక్య పద్మ, గుర్రం వెంకటరెడ్డి , డి లింగయ్య , యం.నాగ శంకర్ ,శ్రీనివాస్, సత్యం,మాధురి,వీరమ్మ, కలమ్మ , విజయలక్ష్మి, నాగరాణి పద్మ,,కృష్ణవేణి, వెంకట్ రెడ్డి, రమేష్, భాస్కర్,,తదితరులు ,పాల్గొన్నారు.