హైడ్రా పరిధిలోకి వచ్చే పేదల ఇళ్లకు ప్రత్యాన్మయం చూపాలి

Sep 3, 2024 - 13:36
Sep 4, 2024 - 10:20
 0  21
హైడ్రా పరిధిలోకి వచ్చే పేదల ఇళ్లకు ప్రత్యాన్మయం చూపాలి

హైడ్రా పరిదిలోకి వచ్చే పేదల ఇళ్లకు ప్రత్యామ్నాయం చూపాలి.

తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేఏసి అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రోటెక్షన్ ఏజెన్సి (హైడ్రా) పరిధిలోకి వచ్చే పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు వనస్థలిపురంలోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు చెరువులు ,కుంటలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్మును రికవరీ చేయాలని అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం హైడ్రా కమిషన్ ఏర్పాటు చేయడం తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేఏసి హర్షం వ్యక్తం చేస్తుంది

అయితే పేద మధ్యతరగతి ప్రజల ఇళ్ళను హైడ్రా నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు

*రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్మి జిహెచ్ఎమ్ సి హెచ్ఎండిఏ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఎప్ టిఎల్ బఫర్ జోన్ లో చెరువులలో కట్టిన అపార్ట్మెంట్లను ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వడం మూలంగా వాటిని కొన్న పేదలు నష్టపోయారని వారి నుండి విముక్తి కలిగించాలని అన్నారు.  ముందుగా పర్మిషన్లు ఇచ్చిన అధికారులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ జేఏసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సదరు అధికారుల వ్యాపారస్తుల ఆస్తులను జప్తి చేయాలన్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు వినిపిస్తున్న పేరు హైడ్రా!

హైదరాబాదులో చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ వల్ల హైదరాబాదును సుందరీకరణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పేదలకు న్యాయం చేయాలి అన్నారు

హైడ్రా పేదలకు న్యాయం జరగాలి హైడ్రా ద్వారా విలాసవంతమైన ఫాంమ్ హౌజ్ లు రిసార్ట్స్ ను తొలగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమానికి తమ అసోసియేషన్ సమర్థిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ తెలిపారు

 అదేవిధంగా ఓఆర్ఆర్ పరిధిలో కబ్జాలకు గురైన చెరువులు కుంటలు అక్రమార్కుల చెర నుండి కాపాడాలని కమిషన్ ఏవి రంగనాధ్ కు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం పేద ప్రజలు చెమటలు ధార పోసిన ఇల్ల విషయంలో హైడ్రా నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులను నమ్మి 

లక్షాలది మంది పేద ప్రజలు కొనుగోలు చేసి మోసపోయిన ప్లాట్లు, ఇళ్లు అపార్ట్మెంట్ల జోలికి వెళ్లవద్దని వారికి ప్రభుత్వంమే ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు బత్తుల అంజయ్య,వెంకట్ రెడ్డి ,జాని రజక మాదగోని సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223