హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలి కుదిలైంది 

పదివేలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి 

Nov 21, 2024 - 18:00
Nov 21, 2024 - 20:09
 0  11

ఎకరంలోపు వెంచర్లకు నాలా కన్వెన్షన్ మీద రిజిస్ట్రేషన్ చేయాలి సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్. (సూర్యాపేట టౌన్ నవంబర్ 21) ప్రభుత్వం తెచ్చిన హైడ్రాతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ముందంజలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలి కుదేలైందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నమ్ముకున్న నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. చిన్నచిన్న పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగాన్ని నమ్ముకున్న చిరు వ్యాపారస్తులు కూడా రియల్ ఎస్టేట్ రంగం కుదేలై నష్టపోతున్నారని చెప్పారు. హైడ్రా రాక ముందు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రతి కార్యాలయంలో 300 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవని కానీ నేడు 100కు మించడం లేదని వాపోయారు. రియల్ ఎస్టేట్ రంగంతో ప్రభుత్వానికి 18,500 కోట్ల ఆదాయం రావలసి ఉండగా కేవలం 12,000 కోట్లు రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగం ద్వారా తక్కువ ఆదాయం వస్తుందని అధికారుల గణాంకాలే చెబుతున్నాయని చెప్పారు. ఎకరంలోపు ఉన్న పాత వెంచర్ల భూములను ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎల్ఆర్ఎస్ కోసం పదివేల రూపాయలు చెల్లించిన ప్రతి ఒక్కరికి నూతన మార్గదర్శకాలు తీసుకొచ్చి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చెరువుల పక్కన బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ జోన్లు నిర్ధారించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సొంత భవనాలు  లేకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పక్కాభవనాలు నిర్మించాలని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పారు. హైదరాబాద్_ విజయవాడ జాతీయ రహదారికి మధ్యలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ ను ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభించాలని ఈ విషయాన్ని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్  పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మం పాటీ అంజయ్య గౌడ్ సారగండ్ల కోటేష్ పట్టేటి కిరణ్ నీలయ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333