స్మశాన వాటికను పట్టించుకోండి

Sep 27, 2024 - 17:15
 0  3
స్మశాన వాటికను పట్టించుకోండి
స్మశాన వాటికను పట్టించుకోండి

 మహా ప్రబో అసంపూర్ణంగా నిర్మాణమైన స్మశాన వాటిక సూర్యాపేట మున్సిపాలిటీలోని పుల్లారెడ్డి చెరువు సమీపంలో ఉన్న ఆదిజాంభవుల స్మశాన వాటిక నిర్మాణం పేరుతో ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ చేతులు కలుపుకొని తూతూ మంత్రంగా నిర్మాణం చేసి చేతులు దులుపుకున్నారు. స్మశాన వాటిక వద్ద దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేయడానికి నీళ్లు లేక,నీటి పైపులు చెడిపోవడంతో పట్టణ ప్రజలు 5 నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత ప్రభుత్వం పట్టణంలో లక్షలాది రూపాయలు వెచ్చించి వైకుంఠ దామాలను ఏర్పాటు చేసి,అన్ని సౌకర్యాలను కల్పించిన తరుణంలో సూర్యాపేట మున్సిపల్‌ పరిధిలో అన్ని సౌకర్యాలతో వైకుంఠధామములను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలిసిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉంది. కానీ పుల్లారెడ్డి చెరువు వద్ద ఉన్న ఆదిజాంభవుల వైకుంఠధామం నిర్మాణం విషయంలో అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తుందో అర్ధం కానీ పరిస్థితి ఉందని పలువురు ప్రజలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. పట్టణంలో ఆదిజాంభవుల స్మశాన వాటిక ఉంది కాని, స్మశాన వాటికకు వెళ్లాలంటేనే ప్రజలు నీళ్లు లేక,పిడం  పెట్టుకోవడానికి స్థలం లేక, స్మశాన వాటిక శుభ్రంగా లేని పరిస్థితి దాపురించిందని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333