సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి... సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట
జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు..ఎస్సై రాజు చిల్లకల్లు ఎస్సై సూర్య శ్రీనివాస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను అనేక మాధ్యమాల ద్వారా ప్రలోభాల గురిచేసి వారి నుండి డబ్బులు కాజేయడం జరుగుతుందని కనుక సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు సూచించారు.
ఎన్టీఆర్ జిల్లా కమీషనర్ ఉత్వరుల మేరకు నందిగామ ఏసిపి ఆదేశాలతో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 15 బ్యాంకుల అధికారులనీ పిలిపించి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సైబర్ నేరాలు బ్యాంకుల ద్వారానే ఎక్కువగా జరుగుతూ ఉండటం వలన ప్రజలను అప్రమత్తం చేస్తూ బ్యాంకులు ద్వారా జరిగే ఆర్థిక నేరాలను అరికట్టాలని బ్యాంక్ అధికారులకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచనలు చేశారు.
జిల్లా అధికారులు ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగిందని అయినప్పటికీ సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతూనే ఉన్నాయని సైబర్ నేరాలను పూర్తిగా నియంత్రించాలి అంటే బ్యాంకుల సహకారం తప్పనిసరిగా ఉండాలని కోరారు.
బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు బ్యాంక్ అధికారులు వచ్చిన ప్రజలకు వారి ప్రవర్తనను అవగాహన చేసుకుని వారి లావాదేవీల వివరాలను తెలుసుకొని అప్పుడు మాత్రమే నగదు బదిలీ చేసే విధంగా సూచన చేయాలని కోరారు.
బ్యాంక్ అధికారులు బాధ్యతగా పనిచేస్తే తప్పకుండా సైబర్ నేరాలు కొంతవరకు అదుపు చేయడం జరుగుతుందని అన్నారు.