సిపిఎస్ రద్దు చేయాలి పి,ఆర్ టి,యు,టి,ఎస్ మండల అధ్యక్షులు కూరాకుల రవీందర్

అడ్డగూడూరు 02 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో టిఆర్టియుటిఎస్ క్యాలెండర్ మండల పరిషత్ సూపర్డెంట్, ఎమ్మార్వో గార్ల చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది,ఈ కార్యక్రమంలో పి,ఆర్,టి,యు,టి ఎస్,అడ్డగూడూరు మండల అధ్యక్షులు కూరాకుల రవీందర్ మాట్లాడుతూ..2004 తర్వాత నియామకమైన ఉద్యోగులందరికీ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు, అలాగే పెండింగ్ బిల్లులు సకాలంలో విడుదల చేయాలని కోరారు.నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయుల వేతనాలను కూడా తొందరగా పరిష్కరించాలని తెలియజేశారు, మధ్యాహ్న భోజన వంట బిల్లులను కూడా తొందరగా చెల్లించి నాణ్యమైన భోజనం అందించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కూరేళ్ల యాకస్వామి,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుదగాని యాదగిరి,పాల బిందెల వెంకటేశ్వర్లు,జిల్లా నాయకులు ఆవుల సైదులు,సుధగాని లక్ష్మయ్య,చుక్కల వెంకటయ్య,పండుగ సామ్సన్,దూదిగాని నరేష్,స్వప్న ఉమాదేవి,యాదగిరి,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.