శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం దర్శించుకున్న ఎమ్మెల్యే సోదరి
జోగులాంబ గద్వాల 9జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మంగళవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోదరి విశాలమ్మ శేసిరెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించి స్వామి వారి శేష వస్త్రం చిత్రపటాన్ని బహుకరించారు.