శ్రీరామ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ.

May 13, 2026 - 11:05
May 13, 2026 - 11:06
 0  1
శ్రీరామ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ.

తెలంగాణ వార్త మే 12 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం. హనుమాన్ జయంతి సందర్భంగా ఎండాకాలం కావడంతో భక్తుల దాహార్తిని తీర్చు నిమిత్తం రామాలయం తూర్పు మెట్ల సమీపం లో శ్రీరామ దీక్ష ప్రచార సేవా సమితి వారి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఈవో దామోదర్ రావు గారిచే ప్రారంభించబడినఈ  కార్యక్రమము నందు అధిక సంఖ్యలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది.  ఈ కార్యక్రమంలో శ్రీరామ దీక్ష ప్రచార సేవా సమితి సభ్యులు కొండ స్వామి,గండేపల్లి హనుమంతరావు,కోలే దామోదర్ రావు, మురికిపూడి గోపి. బెల్లంకొండ వెంకట సత్యనారాయణ, సత్తి లింగం, సతీష్, జగన్, నాగ శ్రీను  కొప్పుల శ్రీను. విజయ్ తదితరులుపాల్గొన్నారు ఎండలు అధికంగా ఉండి భక్తులు ఇబ్బందులు పడుతున్న సమయంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లుపంపిణీ చేసిన నిర్వాహకులను రామాలయం ఈవో అభినందించారు. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333