వ్యవసాయ పొలం దున్నుతూ గుండెపోటుతో మృతి చెందిన యువ రైతు
కేటీదొడ్డి:- వ్యవసాయ పొలం దున్నుతూ ఓ యూవ రైతు మృతి చెందారు. ఈ ఘటన గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండల పరిధిలోని చింతలకుంట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక తెలిపిన వివరాల ప్రకారం.. చింతలకుంట గ్రామానికి చెందిన యూవరైతు మాల వీరేష్(30) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. గురువారం తన వ్యవసాయ పొలం దున్నుతూన్న క్రమంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఆ యూవ రైతుకు భార్య, కూతురు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనతో చింతలకుంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.