వ్యవసాయరంగాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Feb 1, 2025 - 19:40
 0  4
వ్యవసాయరంగాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
వ్యవసాయరంగాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

అన్నదాతకు చేయూతనివ్వడంలో కాంగ్రెస్ సర్కారు విఫలం

వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసిన ఘనత కెసిఆర్  ది

మాజీ మంత్రి,బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .

జోగులాంబ గద్వాల 1 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: జిల్లా పార్టీ నాయకులు కురువ పల్లయ్య, బాసు హనుమంతు నాయుడు, నాగర్ దొడ్డి వెంకట్రాములు, పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు పార్టీ నాయకులతో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వేరుశనగ పంటను పరిశీలించి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని,వ్యవసాయరంగాన్ని పూర్తిగా విస్మరించి అన్నదాతల మనోఒధైర్యాన్ని దెబ్బతీస్తోందని నిరంజన్ రెడ్డి * ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని *మార్కెట్ యార్డ్ నందు వేరుశెనగ డంపింగ్ ను పరిశీలించి,అక్కడే ఉన్న రైతులను కలిసి,వారి బాధ ను అడిగి తెలుసుకున్నారు... అనంతరం,బీఆర్ఎస్ పార్టీ జిల్లా  కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు....

  ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి  మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండదండగా నిలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారిని విస్మరిస్తూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.గంత 423 రోజుల్లో 412 పైచిలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు...కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నీటిని అందించేలా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం రైతులపై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.అలాగే రైతుబంధులోనూ కోత పెడుతున్నారని, పథకాల అమలుపై కాలయాపన తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు....ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తామని వారు అన్నారు. గద్వాల్ మార్కెట్ లో వేరుశెనగకు (MSP) కనీస మద్దతు ధర 6783 గా ఉంటే మార్కెట్లో మాత్రం అతి తక్కువ అంటే MSP కంటే తక్కువ ధరకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు....BRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు MSP కంటే ఎక్కువ ధరలను ఇచ్చి, రైతులను ఆదుకునిందని ఆయన గుర్తు చేశారు...ఎన్నికల వేళ రైతాంగానికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేవరకు తమ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పటేల్ జనార్దన్ రెడ్డి,మోనేష్, మల్దకల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు డి.శేఖర్ నాయుడు,గంజిపేట రాజు,శ్రీ రాములు, శ్రీనివాస్,ఎస్.రాము నాయుడు,తిరుమలేష్,రాజు నాయుడు,మాధవ్, మత్తాలి, రాయపురం వీరేష్,కొళాయి భాస్కర్,బీచుపల్లి,కం తిమ్మప్ప,ముని మౌర్య,నరసింహులు,తిమ్మప్ప గౌడ్,బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి.మాజ్,పరశురాముడు,వీరేష్ గౌడ్, ఆటో ముక్బాల్,సుధాకర్,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333