విద్యార్థుల చదువుల తీరుపై ఆరా - పదవ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం ఎంఈఓ రవీంద్రబాబు

Sep 8, 2026 - 19:22
 0  2
విద్యార్థుల చదువుల తీరుపై ఆరా - పదవ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం ఎంఈఓ రవీంద్రబాబు
విద్యార్థుల చదువుల తీరుపై ఆరా - పదవ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం ఎంఈఓ రవీంద్రబాబు
విద్యార్థుల చదువుల తీరుపై ఆరా - పదవ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం ఎంఈఓ రవీంద్రబాబు

 జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : మండల విద్యాశాఖ అధికారి ప్రాథమిక పాఠశాల ఖమ్మంపాడు మరియు ప్రాథమికోన్నత పాఠశాల గార్లపాడులను సందర్శించారు.


ఈ సందర్భంగా పాఠశాలల్లో జరుగుతున్న మూల అక్షరాస్యత, సంఖ్యా జ్ఞాన బోధనను పరిశీలించి, విద్యార్థుల చదువుల సామర్థ్యాలను సమీక్షించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును, వంట తోట నిర్వహణను, మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రాథమికోన్నత పాఠశాల గార్లపాడులో పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి చర్చ నిర్వహించి, వారి చదువుల పురోగతి, పరీక్షల సంసిద్ధత మరియు లక్ష్యాలపై సూచనలు అందించారు. విద్యార్థుల చదువుల ఫలితాలను మెరుగుపరచడంతో పాటు పాఠశాలలో పరిశుభ్రత, పౌష్టికాహారం మరియు చదువుల ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు.  అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేవులపల్లి సందర్శన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేవులపల్లిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి చర్చ నిర్వహించి, వారి చదువుల పురోగతి, పాఠ్యాంశాల అభ్యసనం మరియు రాబోయే పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన సంసిద్ధతను తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ, ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ, పరీక్షలకు ప్రణాళికతో సిద్ధం కావాలని సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333