విద్యార్థులు చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి జడ్జి శ్రీవాణి

Feb 24, 2025 - 20:49
 0  2
విద్యార్థులు చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి జడ్జి శ్రీవాణి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : -- డిస్ట్రిక్ట్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ జడ్జ్ శ్రీవాణి. ఆత్మకూరు ( ఎస్ ) : విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ...మంచి లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడాలని.. అప్పుడే ఓ మంచి సమాజం ఏర్పడుతుందని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ జడ్జ్ పి శ్రీవాణి ఉద్బోధించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని జ్యోతిబాపూలే బాలుర బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో సోమవారం నాడు ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన శిబిరంలో జడ్జ్ పి శ్రీవాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వాడకం, రవాణా , ఫోక్సో వంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున.., పిల్లలు చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు . చట్టాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకొని సన్మార్గంలో నడవాలని విజ్ఞప్తి చేశారు.సమాజంలో అవసరం ఉన్నవారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రజలకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వచ్చే మార్చి 8వ తేదీన జరిగే బాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రాజీ పడదగిన కేసులను రాజీ చేసుకుని.. శాంతియుత జీవనాన్ని కొనసాగించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. విద్యార్థులు ఆటల్లోనూ, చదువుల్లోనూ ముందుండి తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చాలని, మంచి భవిష్యత్తును అందుకునేందుకు నిత్యం కృషి చేయాలని హితవు పలికారు . మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.కె. మిల్కీ జహాని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ పూర్వ సభ్యులు ఏడిండ్ల అశోక్ , బార్ అసోసియేషన్ కోశాధికారి డి వీరేష్ నాయక్, జిల్లా డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బొల్లెద్దు వెంకట్ రత్నం , జిల్లా కోర్టు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వాణి పెండెం , ఆత్మకూర్ (ఎస్) ఏ.ఎస్.ఐ .దస్తగిరి , డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సిబ్బంది కీత పద్మజ , భాషా నాయక్ ముని, పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.