వికలాంగుల హక్కుల సాధనకై కృషి చేయాలి

Jun 28, 2026 - 18:12
 0  4
వికలాంగుల హక్కుల సాధనకై కృషి చేయాలి

 రామన్నపేట 28 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని శనివారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా సెంటర్లో సుందరయ్య భవనంలో జిల్లా అధ్యక్షుడు సురు పంగప్రకాష్ అధ్యక్షతన... హె లెన్. కెల్లర్.146వ జయంతి. నిర్వహించడం జరిగింది.వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి. వనం ఉపేందర్ . మాట్లాడుతూ. నేడు ప్రపంచవ్యాప్తంగా.హెలెన్. కెల్లర్.146 వ జయంతి ని నిర్వహించటం జరుగుతుంది. వికలాంగుల జీవితాల్లో సంఘసంస్కర్త రచయిత. విద్యావేత్త 146వ జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి నివాళులర్పించారు.ఆమె పుట్టుకతో అందురాలు చెవిటి అయినప్పటికీ. పట్టుదలతో చదివి. 1904 సంవత్సరంలో  రాడ్కిప్ కాలేజీ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు. ఆ రోజులలో ప్రపంచవ్యాప్తంగా వందలాది వ్యాసాలు.14పుస్తకాలు. రాసిఅనేక ప్రసంగాలు చేసినారు. వృద్ధులు వితంతువు లు వికలాంగులు తమ హక్కుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన పోరాటాలు నిర్వహించాలని,వారిలాగా  భయపడకుండా నిర్భయంగా జీవించి తమ కొరకు తామే కాకుండా ఇతరుల కొరకు పని చేయడం నేర్చుకోవాలని వారి స్ఫూర్తి తీసుకొని వికలాంగులు జీవించాలని అన్నారు.కొత్తగా పెన్షన్లు పెట్టుకున్న వారికి అందరికీ మంజూరు చేయాలని పాతవారికి పెన్షన్లు పెంచాలని వృద్ధులు వికలాంగులు వితంతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని, మాటలతో కాక చేతలతో ఆచరణలో,పనిని అమలు చేసి వారికి ఉపయోగపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో  ఎన్.పి.ఆర్.డి జిల్లా గౌరవ అధ్యక్షులు మాటూరి బాలరాజు జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా జిల్లా కమిటీ సభ్యులు పాండాల శ్రీహరి భువనగిరి టౌన్ అధ్యక్షులు వేషాలగోపి,కంబాల  నరసింహ,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333