వయోవృద్ధుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరం
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026 సందర్భంగా నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించారు.
జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారుల పర్యవేక్షణలో, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్, ఐఏఎస్ ఆదేశాల మేరకు, మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సాధికారిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్రీ సునంద సూచనలతో జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ సంధ్యా కిరణ్మయి సహకారంతో ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌లోని వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కంటి పరీక్షలు, ఎముకల సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. వయోవృద్ధులకు వైద్య పరీక్షలు సక్రమంగా జరిగేలా డే కేర్ సెంటర్ నిర్వాహకులు మహేష్ నాయుడు వైద్య సిబ్బందికి సహకరించారు. వయోవృద్ధుల ఆరోగ్య వివరాలను వైద్యులకు తెలియజేస్తూ, పరీక్షలు మరియు మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వయోవృద్ధులు పాల్గొన్నారు.