యాదాద్రి టెస్ట్ బోర్డ్ సభ్యురాలు పోచనబోయిన ఈశ్వరమ్మకు క్షమాపణ చెప్పాలి
తెలంగాణ యాదవ మహాసభ డిమాండ్
ఖమ్మం : గత మూడురోజుల క్రితం ప్రముఖ సంగసేవకురాలు సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నికార్సైన నాయకురాలు తెలంగాణ రాష్ట్రానికి పెద్దమ్మ శ్రీమతి పోచనబోయిన ఈశ్వరమ్మ యాదవ్ , 80 సవంత్సరాల వృద్ధురాలిని అవమానించేవిధంగా కించపరిచిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చరణ్ రెడ్డిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలి , ఈశ్వరమ్మ యాదవ్ కి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి . కనీసం మహిళా వృద్ధురాలు అనే విచక్షణ లేకుండా బీసీ సమాజాన్ని యాదవ సమాజాన్ని అవమానించిన చరణ్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డీసీసీబీ మాజీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఛైర్మెన్ , తెలంగాణ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కురాకుల నాగభూషణం యాదవ్ , బిఆర్ఎస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు , తెలంగాణ యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు పగడాల నాగరాజు యాదవ్ , జిల్లా అధ్యక్షులు కోడిలింగయ్య యాదవ్ , ప్రధాన కార్యదర్శి గుమ్మరోశయ్య యాదవ్ , సంఘం రాష్ట్ర నాయకులు ముడుముంతల గంగరాజు యాదవ్ , మహిళా అధ్యక్షురాలు ఇందుమతి యాదవ్ డిమాండ్ చేశారు . గోకుల కృష్ణ సేవాసమితి భవనం , మధురానగర్ ఖమ్మం లో జరిగిన సమావేశంలో వీరు మాట్లాడారు . యాదాద్రి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలుగా పోచ్నబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించడాన్ని సహించలేని , జీర్ణం చేసుకోలేని ఆధిపత్య వర్గాలు ఈశ్వరమ్మ యాదవ్ పై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు . యూత్ కాంగ్రెస్ నాయకులు చరణ్ రెడ్డి వాళ్ళ నాన్న ప్రభాకర్ రెడ్డి యాదవ్ సమాజాన్ని బీసీ సమాజాన్ని వారి ఎదుగుదలను సహించ లేక అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నారు . గత సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఈశ్వరమ్మ చేసిన సేవలకు గుర్తుగా చిన్న పదవి ఇస్తే తట్టుకోలేక పోతున్నారు . అక్కసు వెళ్ళగక్కుతున్నారు . యాదవులకు పదవులు ఇస్తే జీర్ణించుకోలేక పోతున్నపుడు యాదవుల బీసీ ల ఓట్లు ఎందుకు అడుగుతున్నారని నాయకులు ప్రశ్నించారు . 2శాతం లేని రెడ్డి సామాజిక వర్గం 15 శాతం జనాభా కలిగిన యాదవ్ సమాజాన్ని అవమానిస్తే రాబోవు కాలంలో రాజకీయంగా సమాధి చేయడానికి యాదవులు సిద్ధంగా ఉన్నారని నాయకులు తెలియజేశారు . ఇప్పటికైనా చరణ్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి లను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని , అదేవిధంగా ఈశ్వర్మ యాదవ్ చాలా పెద్దమనిషి పైగా మహిళా అనే కనీస సంస్కారం లేకుండా మాట్లాడిన వీళ్ళు ఈశ్వరమ్మ యాదవ్ కి వెంటనే క్షమాపణ బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు . లేకపోతే రాబోవు కాలంలో యాదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ప్రజాస్వామిక శక్తులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించి మీకు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు . ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల సుగుణరావు యాదవ్ , మహిళా అధ్యక్షురాలు చిత్తూరు ఇందుమతి యాదవ్ , జల్లెల శ్రీనివాస్ యాదవ్ , సారిక రాము యాదవ్ , వల్లూరి తిరుపతిరావు యాదవ్ , చెవుల వెంకటేశ్వర్లు యాదవ్ , చిత్తారు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాగొన్నారు .