మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ. 

ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం. 

Aug 25, 2026 - 17:19
Aug 25, 2026 - 17:21
 0  7
మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ. 

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి వన మహా ఉత్సవంలో పాల్గొన్న సర్పంచ్ జీవన్ రెడ్డి.

 జోగులాంబ గద్వాల 35 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- సర్పంచ్ జీవన్ రెడ్డి ఎంపీడీవో రమాదేవి ఆధ్వర్యంలో మంగళవారము మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ నందు మొక్కలు నాటి నీళ్లు పోయడం జరిగింది. ఎంపీడీవో రమాదేవి మాట్లాడుతూ మొక్కలను నాటడమే కాక పెరిగేలా సంరక్షిస్తేనే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినట్లని ఎంపీడీవో రమాదేవి అన్నారు.  రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏటా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడేందుకు భావితరాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్నారు. అడవులు పెరగడం వలన ఉష్ణోగ్రతలు తగ్గిపోవడమే కాక వర్షాలు సమృద్ధిగా  కురిసిపంటలు సమృద్ధిగా పంటలు పండుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, ఎంపీ ఓ సునీల్,ఇటిక్యాల ప్రాథమిక హాస్పటల్ డాక్టర్ రాధిక, ఏపీవో అశోక్, ఎంఈఓ వెంకటేశ్వర్లు,ఇటిక్యాల హై స్కూల్ హెడ్మాస్టర్ పా గుంట, పంచాయత్ కార్యదర్శి గంగాధర్, అంగన్వాడీ టీచర్ నాగేంద్రమ్మ,ఆశ వర్కర్లు విద్యార్థులు తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State