మే 3 నుండి తొర్రూరు హైదరాబాద్ కు ఏసీ బస్సులు 

May 3, 2025 - 19:02
 0  46
మే 3 నుండి తొర్రూరు హైదరాబాద్ కు ఏసీ బస్సులు 

అడ్డగూడూరు 03 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- తొర్రూరు ఆర్టిసి డిపో నుండి శనివారం నూతనంగా రెండు బస్సులను ప్రారంభించనున్నారు. తొర్రూరు, పెద్ద వంగర, తిరుమలగిరి,అడ్డగూడూరు స్టేజి మీదిగా మోత్కూర్,ఆత్మకూర్(యం) చాలా,రాయగిరి,భువనగిరి, ఘట్కేసర్ ఉప్పల్ వరకు నడిపించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ డిపోకు చెందిన లైజన్ ఆఫీసర్ వేణు చారి శనివారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు. తొర్రూర్ నుండి ఉదయం నాలుగు గంటలకు బయలుదేరి హైదరాబాదు ఉప్పల్ కు ఉదయం 6 గంటల వరకు చేరుకునేలా ప్రారంభించినట్లు తెలిపారు. రాత్రి 8 గంటలకు ఉప్పల్ రింగ్ రోడ్ నుండి బయలుదేరి రాత్రి 9:40 నిమిషాలకు మోత్కూరు చేరుకుంటుందని అన్నారు. మోత్కూర్ నుండి అడ్డగూడూరు తిరుమలగిరి తొర్రూరు రాత్రి10:10 కి చేరుకుంటుందని అన్నారు. ఏసీ బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333