మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బైండ్ల కులస్తులు

పాలకుర్తి 29 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- పాలకుర్తి మండల పరిధిలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు జిలుకర శ్రీనివాస్(చిన్న)ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు మృతునికి ముగ్గురు ఆడపిల్లలు ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితికి చలించిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రానికి చెందిన గణేష్ ట్రేడర్స్ అధినేత జిలుకర శ్రీనివాస్ రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ జిలుకర సోమశేఖర్ 30కిలోల బియ్యం, జిలుకర కవిరాజ్ రూ 1000, గంగుల వెంకన్న పోలీస్ 5 వందల రూపాయలు ఫోన్ పే ద్వారా సాయం అందించారు. మల్లంపల్లి గ్రామంలో శుక్రవారం రోజు మృతుడి దశదినకర్మలో జిలకర శ్రీనివాస్ పాల్గొని సాయం అందజేశారు.ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న నానుడికి నిజమైన నిదర్శనంగా నిలిచారు. ముందు ముందు సైతం బైండ్ల సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలు అకాలంగా కాలం చేస్తే మనసున్న మహారాజులు వారికి దయార్థ హృదయంతో ఆపన్న హస్తము అందిస్తే బాధలో ఉన్న ఆ కుటుంబాలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బంధువులు, మిత్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.