మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం"మానవత్వం చాటుకున్న కోదాడ దేవి మెడికల్ యజమాని

Mar 29, 2026 - 17:06
Mar 29, 2026 - 18:36
 0  0
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం"మానవత్వం చాటుకున్న కోదాడ దేవి మెడికల్ యజమాని

*మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం 

*మానవత్వం చాటుకున్న

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ:- కోదాడ దేవి మెడికల్ యజమాని సుధాకర్ చిలుకూరు మండల కేంద్రంలో జగ్జీవన్ రామ్ నగర్ కాలనీకి చెందిన కందుకూరు గురవయ్య గత ఐదు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినాడు . అతని భార్య కూడా చనిపోవడంతో, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్లది నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న కోదాడ దేవి మెడికల్ యజమాని సుధాకర్ మానవతా దృక్పథం తో వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా వారి కుటుంబ సభ్యులకు 50 kg బియ్యం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మరియు నూకపంగు మణికంఠ, మల్లెపంగు చిరంజీవి, కందుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State