మృగశిర ప్రవేశించి వారం దాటుతోంది అయినా వర్షాలు లేవు. ఎండలు మండుతున్నాయి
దేవాలయాలలో వరుణ యాగాలు జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.
టెంపుల్ టౌన్ భద్రాచలం 15 జూన్ 2026 తెలంగాణవార్త జిల్లా స్టాపర్ :- సుమారు గత నాలుగు నెలలుగా విపరీతమైన ఎండలతో ప్రజలు ఇబ్బందులకు గురైనారు. మృగశిర కార్తె ఎప్పుడు వస్తుందా వర్షాలు ఎప్పుడూ కురుస్తాయో, ఎండ బాధ తప్పుతుందో, అనుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మృగశిర కార్తె కోసం ఎదురుచూస్తూ వచ్చారు. రుతుపవనాలు కూడా వస్తున్నాయని ప్రభుత్వాలు తెలియచేయడంతో రుతుపవనాల ద్వారా వర్షాలు పడతాయని ప్రజలు ఆశపడ్డారు. జూన్ 8వ తేదీ మృగశిర కార్తె ప్రారంభమైంది. అయినా ఇరు రాష్ట్రాలలో సరైన వర్షాలు లేక ఎండలు తగ్గక ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి రెండు తెలుగు రాష్ట్రాల దేవాలయాలలో వరుణ యాగాలు, మొదలగు క్రతువులు జరిపించి వరుణ భగవానుని అనుగ్రహంతో మంచి వర్షాలు కురిసే విధంగా దేవాలయాలలో, మసీదులలో, చర్చిలలో పూజలు జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.