మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు

Feb 8, 2026 - 20:40
Feb 8, 2026 - 21:02
 0  95
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు

బందోబస్తు నిర్వహణకు 1250 మంది పోలీస్ సిబ్బంది.

ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి._ 

- సోమవారం సా.5 గంటల కు ప్రచార సమయం ముగుస్తుంది.

- ప్రచార సమయం ముగిశాక ఎవ్వరూ ప్రచారం చేయొద్దు.

-స్థానికేతరులు, ఓటర్లు కానివారు ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఉండవద్దు.

- ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి.

- ఉచితాలు, బహుమతులు, డబ్బు, మద్యం లాంటివాటితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు.

- ప్రత్యేక బృందాలతో పటిష్ట నిఘా ఉన్నది.

-ఒకసారి ఎన్నికల కేసులో చిక్కుకుంటే భవిష్యత్తులో సమస్యలు తప్పవు.

- అన్ని శాఖలతో సమన్వయంగా పని చేసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం.

.... కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

ఈనెల 11వ తేదీన సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు జరగనున్న రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుందని ఎన్నికలను ఇతర శాఖల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తాం అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీసు నిఘా ఉన్నది అన్నారు, ప్రలోభాల ను నిర్మూలించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తున్నాము అన్నారు. దీనికోసం ప్రత్యేక నిఘా బృందాలు పని చేస్తున్నాయని తెలిపినారు. అదనపు ఎస్పీలు, డిస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది అప్రమత్తంగా పని చేస్తున్నారు అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని కోరారు. ఐదు మున్సిపాలిటీ కేంద్రాలలో 1250 మంది పోలీస్ సిబ్బందితో రక్షణ బందోబస్తు నిర్వహణకు ప్రణాళిక చేయడం జరిగింది అన్నారు. ఐదు మున్సిపాలిటీ కేంద్రాలలో 141 వార్డులకు గానూ 372 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా 115 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది అన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీ కేంద్రాలలో సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసు ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగిందని ఎన్నికల నియమావళి పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ పరిధికి అదనపు ఎస్పీ, డి.ఎస్.పి స్థాయి అధికారి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారిగా ఉంటారు, అలాగే ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ విధులు నిర్వర్తిస్తుంది అన్నారు.

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఎలక్షన్ సెల్ ద్వారా నిరంత పర్యవేక్షణ.

ఐదు మున్సిపాలిటీ కేంద్రాలలో జరగనున్న ఎన్నికలను జిల్లా ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది బందోబస్తు నిర్వహణ మొదలుకుని ఎన్నికల సామాగ్రికి భద్రత కల్పించే వరకు ప్రతి అంశాన్ని ప్రణాళికబద్ధంగా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయం నందు గల సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తి సిసి కెమెరాల నిఘాలో ఉన్నది. 

ప్రచార సమయం ముగిశాక ప్రచారం చేయొద్దు.

9వ తేది సోమవారం సా.5 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగిస్తుంది ఎన్నికల ప్రచార సమయం ముగిశాక అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారం నిర్వహించకూడదని కోరారు, నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కోల్పోతారని తెలిపారు. సోమవారం సా.5 గంటల తర్వాత నుండి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్ డే గా పరిగణించడం జరుగుతుందని ఈ సమయంలో ఓటర్లు గాని వారు స్థానికేతరులు కాలనీలు వార్డులో సంచరించరాదని ఉండకూడదని హెచ్చరించారు. ఓటర్ల మనసు గెలిచి ఎన్నికల బరిలో గెలవాలి అన్నారు అంతేకానీ ఉచితాలు, బహుమతులు, డబ్బు మద్యం లాంటి వాడితో ఓటర్లను ప్రలోభాలకు గురిచెయొద్దు అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

స్వాధీనం.. బైండోవర్.

అసలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిని గుర్తించి 311 కేసుల్లో 450 మందిని ముందస్తుగా బైండోవర్ చేయడం జరిగిందని, గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 1488 మందిని బైండోవర్ చేశాము ఇవి కొనసాగుతాయి అని తెలిపారు. ఎవరు కూడా బైండోవర్ నిబంధన ఉల్లంగించారాదు, బైండోవర్ అంటే సత్ప్రవర్తన కోసం ఇచ్చే హామీ పత్రమని తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిని హామీ పూచికత్తు నగదును రూ.5 లక్షల వరకు జరిమనగా వేయడం జరుగుతుందని అని హెచ్చరించారు. లైసెన్స్ కలిగిన 71 ఆయుధాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. 47 కేసుల్లో రూ.2.80 లక్షల విలువైన 496 లీటర్ల మద్యం సీజ్ చేశాం అన్నారు.

ఎన్నికల సామాగ్రికి రక్షణ.

ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధన ప్రకారం ఐదు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికల సామాగ్రికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఆయుధ పోలీసుల పహారాలో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే ఎన్నికల సామాగ్రి తరలింపులో ఎన్నికల నిర్వహణ అధికారులతో పాటు రూట్ మొబైల్ సిబ్బంది భద్రతగా ఉంటారని తెలిపారు.

పోలీసు బందోబస్తు :

ఐదు మున్సిపాలిటీ కేంద్రాల్లో 1250 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. 

అదనపు ఎస్పీలు - 2.

డీఎస్పీ లు - 4.

ఇన్స్పెక్టర్ లు - 12.

సబ్ ఇన్స్పెక్టర్ లు - 50.

ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ - 265.

కానిస్టేబుల్స్ - 760.

హోంగార్డు - 152.

మహిళా సిబ్బంది - 90 

స్పెషల్ పార్టీ టీమ్స్, బాంబ్ స్క్వాడ్ టీమ్స్.

స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ - 5.

- స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ - 5.

- ప్రతి మున్సిపాలిటీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్ చొప్పున 15 ఫ్లైయింగ్ స్క్వాడ్ విధులను నిర్వర్తించడం జరుగుతుంది. 

- ప్రతి మున్సిపాలిటీకి 2 చొప్పున స్టాటస్టికల్ సర్వే లైన్స్ టీమ్స్ ఉంటాయి.

- ప్రతి మున్సిపాలిటీకి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం ఉంటుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333