ముగ్గురు గంజాయి నేరస్థుల అరెస్టు
సూర్యాపేట 7 మే 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- తేదీ 06-05-2026 సూర్యాపేట రూరల్ ఎస్.ఐ ఎన్. బాలు నాయక్, వారి సిబ్బంది A. కృష్ణ, HC 2324, K. సుధర్శన్, HC 2337 లు కలిసి సూర్యాపేట మండలం, కుసుమవారిగూడెం గ్రామ శివారులో ఇంధిరమ్మ కాలనీ 3వ విడత వద్ద ఉన్న శ్రీ వేంకటేశ్వర గార్డెన్స్, ఫంక్షన్ హాల్ వద్ద గల సూర్యాపేట-దోసపహాడ్ రోడ్డు వద్ద. వాహనాలు తనిఖీ చేయుచుండగా ఉదయం అందాజ 10.30 గం.ల సమయంలో ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకల్ పై వెల్లుతు పోలీసు వారిని చూసి మోటార్ సైకల్ ఆపి తడబడుచుండగా ఎస్‌ఐ గారు వారి సిబ్బంది చూసి వారికి అనుమాస్పదంగా కనిపించగా వారి దగ్గరికి వెళ్తుంటే వారు పోలీసు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నిచగా, వారిని పట్టుబడి చేసి విచారించగా వారి పేర్లు 1. దేశగాని గణేష్ @ తీట శివ @ గన్ని తండ్రి గురుమూర్తి, వయస్సు: 19 సం.లు, కులము: గౌడ్, వృత్తి: కూలీ, R/o డబల్ బెడ్ రూమ్, మూడవ విడత ఇందిరమ్మ కాలనీ దగ్గర, కుసుమవారి గూడెం, సూర్యాపేట మండలం, స్వగ్రామం పెన్ పహాడ్ మండలం లోని, చీదేళ్ళ గ్రామము. సూర్యాపేట జిల్లా 2. పశుల రాంచరణ్ @ చరణ్ తండ్రి చంద్రయ్య, వ; 19 సం.లు, కులం: వడ్డెర, వృత్తి: సెంట్రింగ్ వర్క్ R/o కుసుమవారి గూడెం, సూర్యాపేట మండలం, స్వగ్రామం పెన్ పహాడ్ మండలం లోని మోర్సకుంట తండా. సూర్యాపేట జిల్లా 3. పోతురాజు బన్ని తండ్రి చంద్రయ్య, వ; 19 సం.లు, కులం: SC, మాల, వృత్తి: DJ ఆపరేటింగ్ R/o కుసుమవారిగూడెం, సూర్యాపేట మండలం, ముగ్గురి వద్ద సంచిలో ఉన్న విషయంలో పట్టుకున్న వారిని విచారించగా ముగ్గురు కలిసి సీలేరు వెళ్ళి అక్కడ గంజాయిని కిలోకు రూ.2000/- ల చొప్పున కొనుక్కొని వచ్చి కొనుక్కొని వచ్చి, కొంత అమ్మి, కొంత తాగాలని నిర్ణయించుకున్నాము అని వాటిని 10 గ్రాముల ప్యాకెట్ లు చేసి ఒక ప్యాకెట్ కు 1000/- రూపాయలు చొప్పున త్రాగేవారికి లాభం కొరకు అమ్ముతారాని ఈ రోజు ప్యాకెట్ లు పల్సర్ మోటార్ సైకిల్ పై సూర్యాపేట టౌన్ లోకి వెళ్ళి బస్టాండ్ మరియు చుట్టూ ప్రక్కల అమ్ముటకు వెళ్ళినాము, కానీ ఎవరు కొనలేదు, కావున తిరిగి మేము ముగ్గురము మోటార్ సైకిల్ పై కుసుమవారిగూడెం వస్తుండగా పట్టు బడి చేసినారు వారి వద్ద నుండి 1 kg 160 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకల్ పట్టుబడి చేసి ఈ రోజు జుడిష్యల్ రిమాండ్ కు పంపబడును.
గంజాయి అరికట్టుటకు జిల్లా ఎస్.పి, కె. నర్సింహా గారి ఉత్తర్వుల మేరకు ఇట్టి విషయంలో వెంటనే స్పందించిన D.S.P వి. ప్రసన్న కుమార్, గారి పర్యవేక్షణలో, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇంచార్జ్ సి ఐ ఏ. వెంకటయ్య, సూర్యాపేట రూరల్ ఎస్.ఐ యన్. బాలు నాయక్, జి. వెంకన్న ASI, మరియు రూరల్ సిబ్బంది యండి. అజ్గర్ అలీ, వీరస్వామి రైటర్లు. సిబ్బంది ప్రతాప్, పల్గున్నారు.
జిల్లాలో గంజాయి సేవించిన, అమ్మన కంఠినమైన చర్యలు ఉంటాయని ఎంతటి వారైన ఉపేక్షేoచేది లేదని తెలిపినారు.
తేదీ 07-05-2026