ముఖ్యమంత్రి పర్యటనకు బందోబస్తూ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు
, సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, IPS
జోగులాంబ గద్వాల 3 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి : గద్వాల. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ---- రేపు గుడ్డం దొడ్డి రిజర్వాయర్ ను ముఖ్యమంత్రి పరిశీలించిన అనంతరం పంప్ హౌస్ సందర్శన ఉంటుందని అందుకు ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తూ లో అధికారులు సిబ్బందు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. హెలిపాడ్, పంప్ హౌస్ దగ్గర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పర్యటన పూర్తయ్యే వరకు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని సూచించారు. 700 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది తో
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ కె.శంకర్, డి. ఎస్పీ మొగిలయ్య, ఆర్. డి. ఓ శ్రీనివాస రావు, ఇతర పోలీస్, రెవెన్యూ, ఆర్. & బి,అగ్నిమపాక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.