మా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిగించండి

Jul 3, 2026 - 20:04
 0  2
మా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిగించండి
మా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిగించండి

 బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్  ఎంపీ  డీకే అరుణ కి వినతిపత్రం అందజేసిన 

కేటీ దొడ్డి మండల కొండాపురం BRS యువ నాయకులు గాజుల కృష్ణ రెడ్డి


 జోగులాంబ గద్వాల 3జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతిమతి : కేటి దొడ్డి:-. మండలం కొండాపురం గ్రామంలో ఎల్ భీమ్ రెడ్డి అగ్రికల్చర్ హఖ రైతు సేవ కేంద్రం ఫర్టిలైజర్ షాప్ ఓపెనింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీకే అరుణ కి గాజుల కృష్ణ రెడ్డి  వినతిపత్రం అందజేశారు పత్రంలోని అంశాలు కొండాపురం,వెంకటాపురం, ఇరికిచేడు,గ్రామం లో సుమారుగా 10 నుండి 15 వేల జనాభా కలిగి ఉన్నారు .ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు పైచదువుల కోసం, కార్మికులు పనుల కోసం, మరియు రోగులు వైద్య సహాయం కోసం గద్వాల పట్టణం కి వెళ్లవలసి ఉంటుంది.కానీ, ప్రస్తుతం మా గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేదు. దీనివల్ల విద్యార్థులు సకాలంలో పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేకపోతున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు అత్యవసర వైద్యం అవసరమైన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కావున, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే మీరు స్పందించి, 

మా ఇరుకుచేడు గ్రామం నుండి మా గ్రామం  మీదుగా "గద్వాల పట్టణానికి" ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళల్లో ఆర్టీసీ (RTC) బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని మా గ్రామ ప్రజలందరి తరపున మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాము.

మా సమస్యను పరిశీలించి, త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తారని ఆశిస్తున్నాము. వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333