సీఎం రేవంత్ రెడ్డి రెండు 2 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం విజయ పరంపరలే అధికం
ముక్కు సూటి రాజకీయమే ముఖ్యమంత్రిని చేసింది.
తెలంగాణ వార్త జూలై 03 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : యువ నేతగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజలతో పార్టీ కేడర్ తో ప్రతినిత్యం సన్నిహితంగా ఉంటూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన కొద్దిమంది నేతలలో ముఖ్యమంత్రిశ్రీ రేవంత్ రెడ్డి ఒకరు జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా సంక్షేమం పైనే దృష్టి పెట్టే నైజం శ్రీ రేవంత రెడ్డిని ముఖ్యమంత్రి గా చేసిందని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావఝల. రవికుమార్ పేర్కొన్నారు. కొండనైనాఢీకొట్ట గల గుండె ధైర్యం ఉన్న నేతగా ప్రజలచే గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతూ ప్రజలలో దూసుకుపోవడంతో ప్రజలు ముఖ్యంగా యువత అధిక సంఖ్యలో రేవంత్ రెడ్డిని సమర్ధించడంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగారని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు. రామా వజ్జల రవికుమార్ తెలిపారు. దైవానుగ్రహంఅధిష్టానం ఆశీస్సులు, నేతలు, పార్టీ క్యాడర్ సపోర్ట్అధికంగా ఉన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో దశాబ్ద కాలం ముఖ్యమంత్రిగా ప్రజా సేవ లో నిరంతరం పాల్గొనాలని ప్రజలు కోరుతున్నట్లు రామా వజ్జల తెలిపారు.