మహిళా బాధితులు పోలీస్ అక్క తో సమస్యలు చెప్పుకోవచ్చు
- మహిళలకు, బాలికలకు మెరుగైన సహకారం అందించడానికే పోలీస్ అక్క విన్నూత్న కార్యక్రమం.
.. సూర్యాపేట జిల్లా పోలీస్ అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి.
పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట రూరల్ పోలీసుల, జిల్లా షీ టీం పోలీసుల అధ్వర్యంలో మండల పరిధిలోని బాలెంల గ్రామ సమీపంలో గల తెలంగాణ గురుకుల బాలికల విద్యాలయం నందు పోలీస్ అక్క అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించి మహిళల, బాలికల భద్రతలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు, రక్షణ చట్టాల గురించి, పోలీసు అక్క సేవలను గురించి వివరించారు.
అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వేధింపులకు గురవుతున్న బాలికలు మహిళలకు మెరుగైన సహాయ సహకారాలు అందించడం మెరుగైన భద్రత కల్పించడం పోలీసు అక్క ముఖ్య ఉద్దేశ్యం అని దీని కోసమే రాష్ట్ర పోలీస్ శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది అన్నారు. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక మహిళా పోలీస్ అధికారిని పోలీస్ అక్కగా నియమించడం జరిగినది. ఈ పోలీస్ అక్క మహిళలకు బాలికలకు సొంత అక్క లాగా వారి సమస్యలను విని సమస్యల పరిష్కారానికి కావలసిన సహకారాలు అందించడం చట్టపరంగా చర్యలు తీసుకోవడం లాంటివి చేస్తారు అన్నారు. మహిళలు మరియు బాలికలు తమ వ్యక్తిగత లేదా సామాజిక సమస్యలను ఒక కుటుంబ సభ్యురాలికి చెప్పుకున్నట్లుగా వీరికి వివరించవచ్చు. ఆపదలో ఉన్న వారికి, వేధింపులకు గురవుతున్న వారికి చట్టపరమైన సహకారం అందించి, వారికి అండగా నిలవడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణలో ఇప్పటివరకు షీ టీమ్స్ భరోసా సిబ్బంది పనిచేస్తున్నారని ఇకనుండి పోలీస్ అక్క సేవలు అందిస్తుందని తెలిపినారు.
పోలీస్ అక్క కార్యక్రమం కు సంభందించి పోలీసు కళాబృందం వారు పాటా ఆట లతో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం నందు డిఎస్పీ ప్రసన్న కుమార్, ఎస్ఐ అనిల్ రెడ్డి, షీ టీం ఎస్ఐ నీలిమ, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల, విద్యార్ధినుల పాల్గొన్నారు.