మంచి ఉత్తీర్ణత తేవాలలి:ప్రిన్సిపల్ పి.శశిధర్ రెడ్డి
ఘనంగా కళాశాల వార్షికోత్సవ మరియు వీడ్కోలు వేడుకలు.
జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గట్టు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించాలని ప్రిన్సిపల్ పి.శశిధర్ రెడ్డి అన్నారు.శుక్రవారం గట్టు మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ పి.శశిధర్ రెడ్డి హాజరు అయ్యారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... రెండు సంవత్సరాలలో ఈ కళాశాలలో సెకండియర్ విద్యార్థులు నేర్చుకున్న అనుభవాలను ఉపయోగించుకొని మంచిగా చదివి కళాశాలకు మంచి ఉత్తీర్ణత తేవాలని మరియు తల్లిదండ్రుల ఆశయాలు, కలలు నెరవేర్చాలని సూచించారు. అదేవిధంగా మంచి స్థానానికి వెళ్లిన ఈ కళాశాల ను మర్చిపోవద్దని ఈ కళాశాలకు సహాయ సహకారాలు అందించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా కళాశాల యొక్క సౌకర్యాలు వసతుల గురించి గ్రామాలలో తెలియజేసి కళాశాల యొక్క అడ్మిషన్ల సంఖ్య పెంచడానికి విద్యార్థులే ఒక ప్రచారకర్తలుగా ఉండాలని సూచించారు.మొదటి సంవత్సరం తో పోల్చుకుంటే రెండో సంవత్సరంలో విద్యార్థులు క్రమశిక్షణ మరియు మంచి విలువలు నేర్చుకున్నారని అదేవిధంగా ఉత్తీర్ణత శాతం పెరగడం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల కె ఎస్ టి రాజు, రాజగోపాల్,శ్యాంసుందర్, రంగస్వామి, మహేష్, భరత్, విష్ణు, ఆంజనేయులు శేఖర్ శ్రీజ మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.