భూ భారతి తోనే రైతులకు పరిష్కారం ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 18 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయని ప్రజలు కలెక్టర్ కార్యాలయ చుట్టూ తిరిగారని అప్పుడు అధికారులు ఏమి చెయలేకపోయారని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పై అధికారులతో చర్చించి నియోజకవర్గం లోని 9 మండలాల్లో 9 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు గా సెలక్ట్ చేశామని నియోజకవర్గానికి 3500 ఇండ్లు తుంగతుర్తి ఎస్సి నియోజకవర్గం కానుక అదనంగా 1000 ఇండ్లు ఇవ్వాలని మంత్రి పొంగులేటిని అడగగా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం లో లో ధరణి లో జరిగిన వైఫల్యాలు సరిదిద్ది పారదర్శకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూ భారతి చట్టం ఏప్రియల్ 14 అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభం జరిగిందని సాధాబైనామా ధరఖాస్తులు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణిలో పరిస్కారం కాలేదని భూ భారతిలో అమల పర్చేందుకు పలు సమస్య లు గ్రామ స్థాయి లో పరిస్కారం అవుతాయని తెలిపారు. ఈ చట్టంలో. రైతుల భూమి రికార్డులలో భద్రంగా ఉంటుందని,ప్రజలు కోర్ట్ చుట్టూ తిరగకుండ రెవిన్యూ అధికారులు ప్రజలకి సహకరిస్తు వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా మరియు మండల అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేష్ జుమ్మలాల్ హఫీజ్ లక్ష్మయ్య సుధాకర్ అబ్బాస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు