భారీ వర్షంలో ఇసుక రవాణా

Oct 29, 2025 - 11:56
 0  584
భారీ వర్షంలో  ఇసుక రవాణా

 తిరుమలగిరి 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నందాపురం బిక్కేరు వాగు నుండి "మన ఇసుక మన వాహనం"  పథకం కింద ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. అధికారుల ఆదేశాలు పట్టించుకోని ట్రాక్టర్ యజమానులు మాకు మేమే అన్నట్లుగా మాకు ఎవరు అడ్డు అన్నట్లుగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు భారి నుంచి అతి భారీ వర్షాలు కుడుస్తున్న పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ట్రాక్టర్ యజమానులు, అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 8-12 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, యాదాద్రి - భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో 100-150 మిల్లీమీటర్ల వరకు వరద వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌లోని అమ్రాబాద్‌లో 155 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. రాబోయే గంటల్లో ఈ జిల్లాలో 200 మిల్లీమీటర్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి