బిజెపి పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

తిరుమలగిరి 24 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో మరణించిన భారత జవాన్లకు పౌరులకు నివాళులర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తిరుమలగిరి మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించబడింది ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గం బిజెపి పార్టీ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య మాట్లాడుతూ. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, దానికి ప్రతిస్పందనగా భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు.కొవ్వొత్తుల వెలుగులో దేశభక్తిని ప్రదర్శిస్తూ "భారత మాతా కీ జై", "వీర జవాన్లు, పౌరులు అమరరాహే" వంటి నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో ఈ ప్రదర్శన చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి దిన్ దయాల్ యాదగిరి బంగారి శ్రీనివాస్ సంతోష్ హరీష్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు