బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం.

Sep 14, 2024 - 20:30
 0  7
బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం.

జోగులాంబ గద్వాల 14 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి. మండల కేంద్రంలోని IKP భవనంలో రెండు మండలాల KBS పిల్లలకు MV ఫౌండేషన్ ఆధ్వర్యంలో "మండల స్థాయి కిశోర బాలిక సంఘాల సభ్యులకు'' శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MV ఫౌండేషన్ స్టేట్ కోఆర్డినేటర్ భాస్కర్ గౌడ్  పాల్గొని వారికి  బాలికల పై సమాజంలో  ఉన్న అభిప్రాయాలు,జెండర్ ఇక్వాలిటి,బాలికల ఉన్నత చదువు,బాల్య వివాహాల నిర్ములన, కిశోర బాలిక సంఘాల బలోపేతం మొదలగు విషయాలపై కిశోర బాలిక సంఘాల సభ్యులకు శిక్షణ ఇచ్చారు.అనంతరం రెండు మండలాలకు తెలంగాణ ఆడపిల్లల సమనత్వ సమాఖ్య (TASS) కమిటీ ఏర్పాటు చేశారు.ఈ కమిటీ ద్వారా మండల స్థాయిలో బాలికల సమస్యలను గుర్తించి పిటిషన్ లి  ఇచ్చేలా వారిని ప్రోత్సహించాలన్నారు.కార్యక్రమంలో రెండు మండలాల మహిళ సంఘాల CC లు  తిమ్మప్ప,బుచ్చన్న శాంతినగర్ సేవసమితి సభ్యులు షేక్ అస్లాం షరీఫ్,MV ఫౌండేషన్ సభ్యులు హనిమిరెడ్డి, రజిత కార్యకర్తలు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333