బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం

Apr 17, 2026 - 19:52
 0  1
బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం

బాల్య వివాహలకు వ్యతిరేకంగా గోడ పత్రిక ఆవిష్కరణ: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని విద్యా చందన మరియు జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనినా ఎయిడ్ సంస్థ వారి ఆధ్వర్యంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వారి సౌజన్యంతో బాల్య వివాహాల నిర్మూలనకై గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది.
బాల్య వివాహాల నిర్మూలనకై అందరూ నడుం బిగించాలని బాలల యొక్క భవిష్యత్తుకు ఎంతో కీలకంగా అని, బాల్య వివాహాలు అనేవి ఒక సామాజిక దురాచారం, అనదిగా కొనసాగుతున్నటువంటి ఈ సాంఘిక దురాచారాన్ని అందరం కలిసి సమూలంగా నిర్మూలించాలని బాల్య వివాహం అనేదే లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కై నిరంతరం శ్రమించాలని విద్యాచందన పిలుపునిచ్చారు.
 
ఏప్రిల్ 19 అక్షయ తృతీయ సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను ఆమె చాంబర్లో ఆవిష్కరించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అనునిత్యం గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని బాలల పరిరక్షణ విభాగం ద్వారా బాలలకు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు . చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల బాలికలకు శారీరక మానసిక ఆరోగ్య రుగ్మతలు వస్తాయని సరైన పరిపక్వత లేక పుట్టే పిల్లలు కూడా అనేక రకాల లోపాలతో పుట్టడం వల్ల జీవితాంతం ఆ మనోవేదన అనుభవించాల్సి వస్తుందని కొన్ని సందర్భాలలో మాత శిశు మరణాలు కూడా జరుగుతాయని ఈ నష్టాల వలన స్త్రీ పురుష నిష్పత్తి కూడా గణనీయంగా పడిపోతుందని జిల్లా సంక్షేమ అధికారిని ఆఫీసర్ స్వర్ణలత లెనినా తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి సమ్మక్క డిపిఎం, నర్మద డీపీఎం, అనురాధ ఏపిఎం ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి రాజేష్ కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్స్ మోహన్ , మాన్సింగ్,జ్యోతి, మౌనిక తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333