బస్ స్టాండ్ ను కూల్చి వేసిన వారి పై చర్యలు తీసుకోవాలి

Aug 6, 2025 - 20:56
 0  0
బస్ స్టాండ్ ను కూల్చి వేసిన వారి పై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  .. మండలం పరిధిలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామములో గత 30 సంవత్సరాల క్రితం సిపిఐఎం పార్టీ అమరవీరుల స్మారకార్థంగా నిర్మించిన బస్ స్టాండ్ ను గ్రామ పంచాయితీ కార్యదర్శి మరి కొందరు గ్రామస్తుల తో కుమ్మక్కయి కూల్చివేయటం జరిగింది. కూల్చివేత పై సిపిఎం పార్టీ మండల కమిటీ స్పందించి బుదవారం ఎంపిడిఓ హసిం కు మెమోరాండం ఇచ్చి కూల్చివేసిన వారినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిపిఎం మండల కార్యదర్శి అవిరే అప్పయ్య సిపిఎం మండల నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు బండారు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.