ప్రాడ్ కా ఫుల్ స్టాప్” – ప్రజలలో డిజిటల్ భద్రతపై చైతన్యం కోసం గద్వాల్  పోలీసుల ప్రత్యేక దౌత్యం

Dec 3, 2025 - 20:36
 0  3
ప్రాడ్ కా ఫుల్ స్టాప్” – ప్రజలలో డిజిటల్ భద్రతపై చైతన్యం కోసం గద్వాల్  పోలీసుల ప్రత్యేక దౌత్యం
ప్రాడ్ కా ఫుల్ స్టాప్” – ప్రజలలో డిజిటల్ భద్రతపై చైతన్యం కోసం గద్వాల్  పోలీసుల ప్రత్యేక దౌత్యం

 జోగులాంబ గద్వాల 3 డిసెంబర్ 25 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల సైబర్ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజల భద్రతను కాపాడే కర్తవ్యాన్ని మరింత బలపరిచే లక్ష్యంతో, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ “ప్రాడ్ కా ఫుల్ స్టాప్” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సైబర్ మోసాలు, వాటిని నివారించే మార్గాలపై అవగాహన పెంచడం ప్రధాన ఉద్దేశ్యం.

జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశించారు. ఆయన పర్యవేక్షణలో డి–4–సి సిబ్బంది నిర్వహిస్తున్న నెలవారి “సైబర్ జాగృక్తా దివాస్” లో భాగంగా ఈ రోజు చెనుగోనిపల్లె గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నేటి డిజిటల్ వాతావరణంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీస్తుందని వారు స్పష్టంచేశారు. ఆన్లైన్ లావాదేవీలు పెరగడం, సోషల్ మీడియా వినియోగం విస్తరించడం వంటివి సైబర్ నేరగాళ్లకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టాయని, లోన్ అప్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఏపీకే ఫైల్స్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, ఫేక్ ట్రేడింగ్ మొదలగున్న రకాల ఫ్లాట్స్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలిపారు.  అందుకే ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండటం తప్పనిసరని అధికారులు పేర్కొన్నారు.

పోలీసులు ముఖ్యంగా “గోల్డెన్ అవర్” ప్రాముఖ్యతను వివరించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే మొదటి గంటలో 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేస్తే కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ సమాచారం విద్యార్థులు మరియు ప్రజల్లో మంచి స్పందన కలిగించింది.

డిజిటల్ అరెస్ట్ పేరిట మోసం చేసే కొత్త తరహా నేరాలకు కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి ఆకర్షించారు. పోలీసు శాఖ ఎటువంటి సందర్భంలోనూ ఆన్లైన్ లేదా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయదని, అలాంటి విధానాలు పూర్తిగా మోసపూరితమని హెచ్చరించారు. భయపెట్టి డబ్బు దోచుకునే ప్రయత్నాలను ప్రజలు నిర్లక్ష్యంగా తీసుకోవాలని, ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలని సూచించారు.

డిసెంబర్ 2 నుండి జనవరి 12 వరకు కొనసాగనున్న “ప్రాడ్ కా ఫుల్ స్టాప్” ప్రచారం ద్వారా ప్రతి ఇంటికి సైబర్ భద్రత సందేశాన్ని చేరవేయడం లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. గ్రామాలు, పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లో ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంచే చర్యలు చేపడుతున్నారు. సైబర్ నేరాలపై పోరాటంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అప్రమత్తతే ప్రధాన ఆయుధమని డి 4 సి సిబ్బంది తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి–4–సి సిబ్బంది రమేష్ చారి, గద్వాల్ టౌన్ సైబర్ వారియర్ రాజు, పాఠశాల హెడ్‌మాస్టర్ జి ఉమాదేవి, ఉపాధ్యాయులు రాజేశ్వరి, సురేందర్, అబ్దుల్ అయుమ్, విద్యార్థులు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333