ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయండి

గ్రామ సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్

May 14, 2026 - 11:52
May 14, 2026 - 13:51
 0  117
ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయండి

తిరుమలగిరి 14 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- 99 రోజుల ప్రజా పాలనా వారోత్సవాలలో భాగంగా    తిరుమలగిరి మండలం కోక్యనాయక్ తండా ప్రాధమిక పాఠశాలలో ర్యాలీ నిర్వహించారు పాఠశాల ప్రధానోసాధ్యాయులు వై యాదగిరి  అధ్యక్షతన  సమావేశంలో గ్రామ సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని పాఠశాల విద్యార్ధుల నమోదు పెంచడానికి తన వంతు కృషి చేస్తానని స్థానిక పాఠశాలలో ని విద్యార్థులు చదువులో రాణిస్తున్నారని తల్లితండ్రులు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్ కు మరియు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు యాదగిరి  మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థుల ప్రగతి మెరుగుదలకు మరియు గుణాత్మక విద్య ను అందిండానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి PTMకి హాజరై విద్యార్థుల ప్రగతి విశేషాలు విశ్లేషించుకొని, పాఠశాల అభివృద్ధికి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి