ప్రభుత్వ పథకాలపై అవగాహన

నూతనకల్ 18 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారుల ఆదేశాల మేరకు నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో రైతు భరోసా, ఉచిత విద్యుత్తు. రైతు రుణమాఫీ, సన్న బియ్యం పథకం, ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ సమావేశంలో మాట్లాడారు అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత వడదెబ్బ తీవ్రతపైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో.సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు. ఈర్ల సైదులు, గడ్డం ఉదయ్, వెన్నెల నాగరాజు, మాగి శంకర్, పాక ఉపేందర్, మేడిపల్లి వేణు, మద్దిరాల మంజుల, సిరిపంగి రాధ, నెమ్మాది స్రవంతి, పోతరాజు శిరీష, గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..