ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తత్రంగా తీసుకెళ్లాలి : పట్నం సునీత మహేందర్ రెడ్డి
కూకట్ పల్లి తెలంగాణ వార్త, ఏప్రిల్ 11:- పేద ప్రజల జీవనోపాదులను పెంపోందించేందుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తత్రంగా తీసుకెళ్లాలని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గo కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. బుధవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె బాలానగర్ పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్బంగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్, డివిజన్ అధ్యక్షులు పార్టీ నాయకులతో నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారంపై ఆమె చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల దృక్పథం ఏర్పడుతుందని తద్వారా పార్టీ విజయం సులభం అవుతుందని సూచించారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా సునీ…
***
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య
మేడ్చల్ జిల్లా,
తెలంగాణ వార్త, ఏప్రిల్ 11 : రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయాలలో నేరుగా సూర్య కిరణాలూ తాకే స్థలాలలో పని చేసే వారు వడదెబ్బకు గురి కాకుండా ఉండేలా నివారణ చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ లోని వి సి హాల్ లో జాతీయ కార్యక్రమం వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యంపై అనే అంశంపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రఘునాథ స్వామితో కలిసి అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య హాజరయ్యారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు, నేరుగా సూర్య కిరణాలూ తాకే స్థలాలలో పని చేసే వారు వడదెబ్బకు గురి కాకుండా ఉండేలా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య, విద్య, డిసాస్టర్ మానెజ్మెంట్ అథారిటీ, వ్యవసాయ, పశు సంవర్ధక, పబ్లిక్ వర్క్స్, పర్యావరణ, కాలుష్య నివారణ, మున్సిపల్ కమీషనర్ శాఖల వారు సమన్వయంతో పని చేయాలన్నారు. వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకు కూడళ్ల దగ్గర, పార్కుల వంటి స్థలాల వద్ద చలి వేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి త్రాగు నీటిని, చలి వేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. బయటికి వెళ్లే ప్రతి ఒక్కరు తలపై టోపీ, టవల్ ధరించాలని, ఓఆర్ఎస్ పౌడర్ కలిపిన నీటిని వెంట తీసుకువెళ్లాలని తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను యూపిహెచ్సి, పిహెచ్సి కేంద్రాలకు ఏఎన్ఎం, ఆశ వర్కర్లతో పంపిణి చేయించాలన్నారు. వడదెబ్బ తగిలిన వారికీ శీతల పానీయాలు కాకుండా, మంచి నీళ్లు, ఓఆర్ఎస్ కలిపిన నీళ్లు వెంటనే త్రాగించి, నీడ ఉండే ప్రదేశాలలో ఉండేలా చూడాలన్నారు. ముగాజీవాలకు, పక్షులకు మంచినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం వడ దెబ్బ నుండి రక్షించుకుందాం అనే గోడ పత్రికను అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సాంబశివ రావు, డిఏఓ రేఖ, డిజిడబ్ల్యూఓ రేవతి, డిడబ్ల్యూఓ కృష్ణ రెడ్డి, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
**
కార్యకర్తల బలం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది : ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి
కుత్బుల్లాపూర్
తెలంగాణ వార్త, ఏప్రిల్ 11 : కార్యకర్తల బలం వల్ల పార్టీ ఈరోజు ఈ విధంగా ప్రతిష్టంగా ఉండి అధికారంలోకి వచ్చిందని, అదే విధంగా జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీ అందించి గెలిపించేందుకు కార్యకర్తలు అంతా సమిష్టిగా కృషి చేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కోరారు.
బుధవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సూరారం కాలనీలోని రాజీవ్ గృహకల్ప, 60 గజాల నుండి తెలుగు తల్లి నగర్ సాయిబాబా నగర్ వరకు మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్స్ పార్టీ ఆరు గ్యారంటిలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, కాంగ్రెస్స్ పార్టీని అత్యధిక స్థానాలలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంతు రెడ్డీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు భూపతి రెడ్డీ జోస్నా శివారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, బొంగోనూరి శ్రీనివాస్ రెడ్డి, బండి శామ్ గౌడ్, ఎంఎంసీ సీనియర్ నాయకుడు కోలన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఎంసీ అధ్యక్షులు కోలన్ రాజ శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు అంజలి, ప్రధాన కార్యదర్శి రఫీయ బేగం, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, ఏ,బీ బ్లాక్ అధ్యక్షులు, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ అవిజే జేమ్స్, నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, ఐఎన్టియుసి నాయకులు పాల్గొన్నారు.