ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించిన డిఐఈఓ

May 2, 2025 - 20:42
 0  26
ప్రభుత్వ జూనియర్ కళాశాల  సందర్శించిన డిఐఈఓ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిమికల్ సందర్శించిన డిఐఈఓ భాను నాయక్ విద్యార్థుల ఉత్తీర్ణతపై సమీక్ష ఫలితాలను పరిశీలించిన డిఐఈ ఓ సప్లమెంటరీ పరీక్షలకు అధ్యాపకులు సన్నద్ధం చేయాలి ప్రతి అధ్యాపకుడు బాధ్యతగా వ్యవహరించాలి లేకుంటే చర్యలు తపప్పవు అడ్మిషన్లపై దృష్టి సారించాలి ప్రతిరోజు కళాశాలకు అధ్యాపకులు హాజరు కావాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల నమ్మికల్ ను డిఐ ఈ ఓ బాను నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు కళాశాలలో ఉన్న విద్యార్థులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధి కోసం ప్రతి అధ్యాపకుడు కృషి చేయాలని తెలియజేశారు 2025 సంవత్సరంలో వచ్చిన ఫలితాలను సమీక్షించారు గత ఏడాది కంటే ఈ ఏడాదిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అభినందించారు కళాశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించి అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధి పట్ల ప్రతి అధ్యాపకుడు బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు కొంతమంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కళాశాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పాటించాలని వివరించారు గత ఏడాదితో పోలిస్తే మంచి ఫలితాలు సాధించిన నెమ్మికల్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులను అభినందించారు కళాశాలలో అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి అధ్యాపకుడు కళాశాలలో ఉండాలని ఆదేశించారు కళాశాలలో ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించిన విద్యార్థిని శుమశ్రీ ని సన్మానించారు బైపిసి విభాగంలో రెండో సంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించిన హనీఫాను మరియు లక్ష్మి కూడా సన్మానించి అభినందించారు బైపిసి విభాగంలో మార్కులు సాధించిన ఐశ్వర్యను కూడా సన్మానించారు అనంతరం అధ్యాపకులతో సమీక్షించారు ప్రతి అధ్యాపకుడు కూడా అడ్మిషన్ డ్రైవ్ లో పాల్గొనాలని తెలిపారు. ఈ ఏడాది అడ్మిషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ యు డైస్ అనుగుణంగా వ్యవహరించాలని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని అందుకు అనుగుణంగా ఏ అధ్యాపకునికి కూడా సెలవులు లేవని చెప్పారు మే 22 నుంచి జరిగే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఇంటర్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య మరియు జాయింట్ సెక్రటరీ భీమ్ సింగ్ ఆదేశాలను ప్రతి కళాశాల అధ్యాపకులు పాటించాలని సూచించారు నూరు శాతం ఫలితాల కోసం అధ్యాపకులు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పెరుమాల యాదయ్య కాలేజీ అధ్యాపకులు గున గంటి వెంకటేశ్వర్లు దశరథ డాక్టర్ అమల లింగయ్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు