- ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి పోలీసు సిద్ధం
- 99 రోజుల కార్యాచరణలో రక్షణ అంశాల్లో పాల్గొంటాం.
- రోడ్డు భద్రత, పిల్లల మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, విద్య, యువత, పర్యావరణం అంశాలపై విస్తృత అవగాహన కల్పిస్తాం. .... కె నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనటానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వివిధ అంశాల పట్ల ప్రజలను యువతను చైతన్యవంతం చేసి కార్యక్రమంలో విజయవంతంగా ముందుకు వెళ్తామని ఎస్పీ నర్సింహా తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సూచించిన అంశాలకు సంబంధించి రక్షణ పరమైన విధివిధానాలలో పోలీస్ శాఖ పాల్గొంటోంది. దీనిలో భాగంగా కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైల్స్ ను పరిష్కరించడం, అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత ప్రమాదాల నివారణ కార్యాచరణ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం - చట్టాల అమలు, పిల్లలు మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, వ్యవసాయం- నకిలీ విత్తనాల నిర్మూల, విద్యా, యువత క్రీడలు, పర్యావరణం మొదలగు అంశాల మీద ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తామని అన్నారు. కార్యక్రమాల నిర్వహణ కార్యక్రమాల్లో పాల్గొనడానికి పోలీస్ శాఖ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని, రోజువారి ప్రణాళిక ప్రకారం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పాల్గొంటారని అన్నారు. ఈ 99 రోజుల ప్రణాళికలో రక్షణ పరమైన అంశాల పట్ల పోలీస్ శాఖ ప్రజలను చైతన్యవంతం చేస్తుందని అన్నారు.
పోలీస్ కార్యాలయాల పరిసరాలు శుభ్రం చేసిన పోలీస్..
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్, సర్కిల్, డివిజన్ కార్యాలయాల పరిధిలో పరిసరాలు పరిశుభ్రం చేయడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయం నందు అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పోలీస్ పరేడ్ గ్రౌండ్, గార్డెన్ పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగినది. జిల్లా పోలీస్ కార్యాలయం నందు జరిగిన పరిశుభ్రత కార్యక్రమంలో డీఎస్పీ నర్సింహ చారి ఆర్ఐ జానయ్య ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.