పోలీస్ సిబ్బంది కోరుకున్న పోలీస్ స్టేషన్ కు బదిలీ

Jun 4, 2026 - 02:47
Jun 4, 2026 - 02:48
 0  0
పోలీస్ సిబ్బంది కోరుకున్న పోలీస్ స్టేషన్ కు బదిలీ
పోలీస్ సిబ్బంది కోరుకున్న పోలీస్ స్టేషన్ కు బదిలీ

- పారదర్శకంగా కౌన్సిలింగ్.

- సిబ్బంది ఆరోగ్యం, సేవలు, పనితీరు కు ప్రాధాన్యం ఇస్తూ  బదిలీ.

- వత్తిడి, సమస్యలను అధిగమించి పని చేయాలి.

- వివాదాలకు తావులేకుండా చట్టపరిధిలో పని చేయాలి.

- ప్రజలకు పోలీస్ సేవలు అందించడంలో సమర్థవంతంగా పని చేయాలి.

. సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్.

సూర్యాపేట :-  జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న 77 మంది హెడ్ కానిస్టేబుళ్ల కు, 25 మంది కానిస్టేబుళ్లకు పారదర్శకంగా కౌన్సిలింగ్  నిర్వహించి బదిలీ ఉత్తర్వులు జారీచేసిన జిల్లా ఎస్పి నరసింహ. వివాదాలకు తావులేకుండా ఒత్తిడిని సమస్యలను అధిగమిస్తూ ప్రజలకు పోలీసు సేవలు అందించడంలో చట్ట పరిధిలో సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు.

సూర్యాపేట జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ ల నందు పని చేస్తూ అయా పోలీస్ స్టేషన్ ల నందు సర్వీసు కాలం పూర్తి చేసుకున్న 77 మంది హెడ్ కానిస్టేబుళ్లకు, 25 మంది కానిస్టేబుళ్లకు ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించి సిబ్బంది కోరుకున్న పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పి నరసింహ మాట్లాడుతూ కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇచ్చాం, అనుభవాన్ని ఉపయోగించి పోలీసు సేవలు అందించాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల నందు పని చేస్తూ సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించిన అనుభవం ఉన్నదని, కష్టమైన పరిస్థితుల్లో కూడా ఉద్యోగం నిర్వహించి ఈ స్థాయికి వచ్చారు అన్నారు, మీ యొక్క పూర్తిస్థాయి అనుభవాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌజ్ అధికారి గారికి, జూనియర్స్ కు, తోటి సిబ్బందికి పనిలో కలుపుకుని కష్ట పడి పని చేస్తూ ఆదర్శంగా ఉండాలని తెలిపినారు. కేసుల దర్యాప్తులో నైపుణ్యం, మెళకువలు చూపాలి, కొత్త చట్టాల ప్రకారం హెడ్ కానిస్టేబుల్ స్టేషన్ ఇంఛార్జి అధికారిగా పోలీస్ స్టేషన్ లో అన్ని విధులను, పనులను పర్యవేక్షణ చేయాలి. సమస్యలు, ఫిర్యాదులను పై అధికారుల దృష్టిలో పెట్టాలి. అధికారులతో మంచి సమన్వయం కలిగి ఉండాలి అన్నారు. హెడ్ కానిస్టేబుల్ బాధ్యతగా ఉండకపోతే స్టేషన్ లో ఉన్న క్రింది స్థాయి సిబ్బంది  పనిలో నైపుణ్యం సాధించలేరు అన్నారు. స్టేషన్ పరిధిలో జరిగే సాంఘిక కార్యకలాపాలు గుర్తించి నిరోధించడంలో కృషి చేయాలని సూచించారు. మంచి ఆహార అలవాట్లు కలిగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయడం, యోగ చేయడం లాంటి చేయాలి అన్నారు. రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు, విధులు నిర్వర్తించే చోటే నివాసం ఉండాలని అన్నారు. 

అంచనాలకు మించి పని చేయాలని అన్నారు. పిర్యాదుదారుల పట్ల మర్యాద ప్రవర్తించాలి, బరోసా కల్పిస్తూ వేగంగా స్పందించాలని సూచించారు. సామాజిక అంశాలు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నిర్మూలన, సైబర్ మోసాలు, డ్రగ్స్ గంజాయి నిర్మూలన, అసాంఘిక చర్యల నిర్మూలన పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు. చట్టప్రకారం పని చేయండి. నేరాలు, తప్పులు చేసేవారి పట్ల, ప్రజలను ఇబ్బంది పెట్టే వారి పట్ల. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు అన్నారు.

ఈ కార్యక్రమం లో అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ సంఘం అధ్యక్షులు ఎస్ఐ రామచందర్ గౌడ్, సెక్షన్ సూపరింటెండెంట్ సబితా రాణీ, సీసీ సందీప్, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333