పోలీసు అధ్వర్యంలో జిల్లాలో వారంరోజుల పాటు డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమాలు.
ప్రజలు, యువత భాగస్వామ్యం కావాలి అని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ కోరారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం జూన్ 26 సందర్భంగా సూర్యాపేట జిల్లాను మాదకద్రవ్యాల (డ్రగ్స్) మరియు గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎస్పి నరసింహ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఈగల్ పోర్స్, సూర్యాపేట జిల్లా పోలీస్ అధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి వారం రోజుల పాటు మాదకద్రవ్యాల (డ్రగ్స్) మరియు గంజాయి నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పి తెలిపినారు. సమాజానికి పట్టిన డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడానికి "SAY NO TO DRUGS" నినాదంతో యువతను, విద్యార్థులను మరియు ప్రజలను చైతన్యపరచడమే ఈ ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల భారీ నుండి మన పిల్లలను, మన సమాజాన్ని రక్షించుకోవాల్సిన కనీస బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.
అవగాహన కార్యక్రమాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యాసంస్థలు, జన సమూహాలు, కమ్యూనిటీ హాల్స్, వ్యాపార సముదాయాలు, ట్రాన్స్పోర్ట్ సముదాయాలు, ఇతర అన్ని ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను యువతను వాహన డ్రైవర్లను మహిళలను భాగస్వామ్యం చేసి డ్రగ్స్ నిర్మూలనపై చైతన్య పరుస్తామని తెలిపారు.