పేటలో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవం

Sep 18, 2024 - 09:40
Sep 18, 2024 - 10:27
 0  45
పేటలో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవం

పేటలో ఘనంగా శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవం

తెలంగాణ వార్త 18.09.2024. సూర్యాపేట జిల్లా ప్రతినిధి ..

ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన విశ్వకర్మలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ వీధిలో మంళవారం శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పట్టణ ప్రధాన వీధుల్లో విశ్వకర్మ భగవాన్ విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామి వారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకారపు పరిపూర్ణచారి, ప్రధాన కార్యదర్శి నారాయణ్స్ నర్సింహ్మచారి, ఉపాధ్యక్షులు దామోదరచారి, కోశాధికారి గుండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223