పుణ్యాత్ములు
ఒక్కరేమో రోడ్డును ప్లాట్ చేసి అమ్ముతాడు
ఇంకోడేమో రోడ్లపైకి మెట్లు వేసి కబ్జా చేస్తాడు
మరొక్కడేమో రోడ్ పైనే బోర్ వేయడానికి ట్రై చేస్తాడు
ఇంకొడేమో రోడ్డును తవ్వి ఇంకుడుగుంత చేస్తాడు
ఇలా ఎవరికి వారు రోడ్లను కబ్జా చేసుకుంటి పోతే... ఈ నగరం ఎటు పోతుంది?
జోగులాంబ గద్వాల 8 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల అసలు గద్వాల వాసులకు రోడ్లు అవసరం లేదా? బహిరంగానే రోడ్లను కబ్జా చేసుకుంటే ఎందుకు పట్టించుకోరు? గద్వాల అభివృద్దిలో ఎందుకు భాగస్వాములు అవడం లేదు. ఎవరికి వారు సొంతంగా నాలుగు పైసల్ సంపాదిస్తే అభివృద్ది జరిగినట్టా? ఇంత బహిరంగా కబ్జా చేస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు? గద్వాల పట్టణా వాసుల నుంచి వినిపిస్తున్నాయి.