పాఠశాలను ఆకస్మికతనికి డిఇఓ.
జోగులాంబ గద్వాల 15 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి విజయలక్ష్మి ఈరోజు ఎర్రవల్లి మండలంలోని MPUPS తిమ్మాపూర్, MPPS బేటలియన్, ZPHS ఎర్రవల్లి బేటలియన్, ZPHS కొండేరు మరియు MPPS కొండేరు పాఠశాలలను సందర్శించి విద్యా, పరిపాలనా మరియు మధ్యాహ్న భోజన పథకం అమలును సమీక్షించారు. అనంతరం మండల విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించి (MEO OFFICE) విద్యా కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా MPUPS తిమ్మాపూర్ మరియు ZPHS కొండేరు పాఠశాలలలో విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్‌ను పంపిణీ చేశారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న విద్యా వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని విద్యా ప్రమాణాలను పెంపొందించుకోవాలని సూచించారు.
అదేవిధంగా MPPS కొండేరు మరియు ZPHS కొండేరు పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, వంటశాలలు, ఆహార నిల్వలు, వంట సామాగ్రి మరియు పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన ఆహారాన్ని అందించడం ప్రతి పాఠశాల బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ, "ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అందిస్తున్న ప్రతి సౌకర్యం వారికి సకాలంలో చేరేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీని పూర్తిస్థాయిలో పూర్తి చేసి, ప్రతి విద్యార్థి విద్యాభ్యాసానికి అవసరమైన వనరులు అందుబాటులో ఉండేలా చూడాలి. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల హాజరు, అభ్యాస ఫలితాల మెరుగుదలపై నిరంతరం దృష్టి సారించాలి. అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలులో నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు" అని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీ జె. అమీర్ పాషా, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పర్యటనతో పాఠశాలలలో విద్యా మరియు పరిపాలనా వ్యవస్థల బలోపేతానికి మరింత ప్రోత్సాహం లభించిందని అధికారులు తెలిపారు.