నేల సంరక్షణ పై అవగాహన

Jun 18, 2026 - 07:11
 0  96
నేల సంరక్షణ పై అవగాహన

  తిరుమలగిరి 18 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో బుధవారం నాడు ఖేత్ బచావో అభియాన్" నేలలను రక్షించుకుందాం పై అవగాహన సదస్సుు నిర్వహించార కృషి విజ్ఞాన కేంద్రం-గడ్డిపల్లి శాస్త్రవేత్త డా. పి. అక్షిత్ సాయి, సైంటిస్ట్ వ్యవసాయ విస్తరణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ భూసారాన్ని కాపాడటానికి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ వ్యవసాయాన్ని చేయాలి అన్నారు.భూసార పరీక్ష కు మట్టి నమూనా సేకరించే విధానం పై అవగాహన కల్పించారు.అధికంగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూసారం తగ్గిపోతోంది. వీటి వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ మరియు సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులకు అవగాహన కల్పిస్తారు.భూసార పరీక్షలు ప్రతి రైతు తన భూసార పరీక్షలు చేయించుకొని, భూమికి అవసరమైన పోషకాలను, ఎరువులను మాత్రమే వాడేలా ప్రోత్సహిస్తారు. దీని ద్వారా సాగు ఖర్చులు తగ్గుతాయి.సుస్థిర వ్యవసాయం: వాతావరణ మార్పులను తట్టుకుంటూ, ఎక్కువ దిగుబడి సాధించే ఆధునిక, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. ఈ ప్రచారం ఒక నెల రోజుల పాటు జిల్లాలోనీ గ్రామాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో  మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరావు, వ్యవసాయ విస్తరణ అధికారి మహిత, గ్రామ సర్పంచ్ బి.కృష్ణయ్య, వర్డ్ మెంబర్ దరావత్ రమేష్, మనం రిపోర్టర్ పులిమామిడి మల్లేష్,  బిసు శ్రీకాంత్ మరియు పులిమామిడి యాదగిరి, వేముల రాములు ఇతర రైతులు పాల్గొనారు..... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి