నూతన కమిటీని అభినందించిన:రాంరెడ్డి సర్వోతం రెడ్డి..
సూర్యాపేట: చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అభినందనలు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైట్ హౌజ్‌లో ఆయనను నూతన కార్యవర్గం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గండూరి రమేష్, ఉపాధ్యక్షులు చిలివేరు నరసింహారావు, కార్యదర్శి భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముషం హరిప్రసాద్, డైరెక్టర్లు ముషం యాదమ్మ, విడం నీరజ, పెద్ది శ్రీనివాస్, యాలగందుల లక్ష్మయ్య, యాలగందుల సాయి నేత, కడారి బిక్షం, బాల్నే మల్లయ్య, యాలగందుల సుదర్శన్, దూలం నగేష్, ఎస్.రాములు తదితరులు ఉన్నారు.