నీట్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు
సూర్యాపేట పట్టణంలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్న తెలంగాణ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ గురుకుల మహిళా కళాశాల నందు పరీక్షా కేంద్రాన్ని ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు సందర్శించారు. ఈ సందర్బంగా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు, పరీక్షకు హాజరౌతున్న విద్యార్థులతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపినారు. బందోబస్తు వివరాలు, విద్యార్థుల హాజరు వివరాలను స్థానిక డిఎస్పీ ప్రసన్న కుమార్ ను అడిగి తెలుసుకున్నారు, పరీక్ష అనంతరం పరీక్ష పత్రాలను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పి పలు సూచనలు చేశారు.