ధ్యానం ద్వారా మీ మనసు అదుపులో ఉంటుంది
ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి హృదయ రాజు
జోగులాంబ గద్వాల 19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఇంటర్మీడియట్ కమిషనర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన శిక్షకులు బాలస్వామి విద్యార్థులకు ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గి మనసును అదుపులో ఉంచుకోవడం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది మీ లక్ష్యాలను సునాయసంగా చేరుకోవచ్చని కనక ప్రతి విద్యార్థి ఈ ధ్యానం నేర్చుకొని ప్రతిరోజు మీ ఇంట్లో ఒక పది నిమిషాలు కేటాయించాలని తెలియజేశారు. విద్యార్థులతో ధ్యానం కూడా చేయించారు ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి హృదయ రాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకున్న అంశాలు మర్చిపోకుండా ప్రశాంతంగా జీవితం గడపడానికి ఒత్తిడి తగ్గించుకోవడానికి తమ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ధ్యానం ఉపయోగపడుతుంది కనుక ప్రతి విద్యార్థి ధ్యానం చేయాలని కోరినారు. విద్యార్థులు మాట్లాడుతూ ధ్యానం ద్వారా మా మనసులు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి తగ్గుతుందని ఇకపై నుండి ప్రతిరోజు మేము పది నిమిషాలు ధ్యానం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వీరన్నఅధ్యాపక బృందం అధ్యాపకే తరఫున పాల్గొన్నారు