దేశంలోనే గద్వాల రైల్వే స్టేషన్ ప్రాఖ్యాతగాంచింది

Feb 26, 2024 - 20:51
 0  26
దేశంలోనే గద్వాల రైల్వే స్టేషన్ ప్రాఖ్యాతగాంచింది

ఉమ్మడి జిల్లాలోనే గద్వాల రైల్వే స్టేషన్కు పెరిగిన ప్రయాణికుల రద్దీ, ఆదాయం

వందేకారాల రైల్వే స్థలాన్ని అభివృద్ధి చేయాలి

ప్రయాణికుల సౌకర్యార్థం గద్వాల స్టేషన్ లో మరిన్ని రైళ్లు ఆపాలి

 అమృత్ భారత్ పథకంలో భాగంగా 9.49 కోట్లతో గద్వాల రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు  మరియు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి . 

జోగులాంబ గద్వాల 26 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. అమృత్ భారత్ పథకంలో భాగంగా గద్వాల రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9.49 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం శంకుస్థాపనలు చేశారు. అందులో భాగంగా ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల జంక్షన్ రైల్వే స్టేషన్ లో పున: నిర్మాణం పనుల శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా నాకర్నూల్ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు * , *గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  * జిల్లా అదనపు కలెక్టర్ * *మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ . హాజరయ్యారు .  నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కి, ఎమ్మెల్యే కి రైల్వే అధికారులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రైల్వేస్టేషన్ పునర్నిర్మాణానికి ఒకేసారిగా పనులు  ప్రారంభం చేసే విధంగా ప్రత్యక్ష ప్రచారం ఈ స్క్రీన్ లో ప్రసారమైన ప్రసంగాన్ని వీక్షించారు.   తెలంగాణ రాష్ట్రానికి 230 కోట్ల రూపాయలు నిధులతో కేటాయించి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి  పనులను ప్రారంభం చేశారు.   గద్వాల రైల్వే స్టేషన్ నందు నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు రాములు  ఎమ్మెల్యే  రూ. 9.49 కోట్లతో నిర్మాణ పనులకు  శంకుస్థాపన చేసి  శిలాఫలకాన్ని ప్రారంభించారు.
అనంతరం అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే అధికారులు వివిధ పాఠశాల విద్యార్థులకు ఎస్సే రైటింగ్ వీటిలో విజేతలు సాధించిన వారికి  ఎంపీ ఎమ్మెల్యే ఛైర్మన్ జిల్లా అదనపు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రమును మెమొంటోను అందజేశారు.    గద్వాల రైల్వే అభివృద్ధి కొరకు నిధులు కేటాయించినందుకు గద్వాల నియోజకవర్గం ప్రజల తరఫునుంచి ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేక ధన్యవాదాలు.
 గద్వాల నుండి రాయచూర్ లైను 2013 నుండి డోన్ నుండి కాచిగూడ కాచిగూడ వరకు ఎలక్ట్రికల్ రైలు పనులను పూర్తి చేశారు . దాదాపుగా 20 రైళ్లు గద్వాల జంక్షన్లో స్టాప్ ఆగడానికి ఇక్కడ ప్రజలకు ప్రయాణిలకు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం కల్పించారు. దాదాపుగా అనునిత్యం ప్రజలు హైదరాబాద్ అనేకమైన  పనుల పైన వెళ్లడం జరుగుతుంది వారికి ఏ సమయమున ఏమైనా ఏదో ఒక రైలును ప్రయాణం చేయడానికి అన్ని రైలు గద్వాలలో ఆగేవిధంగా కృషి చేయడం జరిగింది. గతంలో రైల్వే సమావేశంలో రైల్వే అధికారులకు నేను కోరడం జరిగింది విధంగానే వారు ఈ అవకాశాలను కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మరికొన్ని  రైళ్లు కూడా గద్వాల ప్రాంతంలో ఆగేవిధంగా   ప్రయాణికులకు సులభమైన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు.
  ఎన్నో ఏళ్లుగా గద్వాల రైల్వే స్టేషన్ లో రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం  పనులకు గద్వాలను కూడా ఎంపిక చేసి పెద్ద దాదాపు పది కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించి అన్ని రకాల హంగులతో ఆధునీకరమైన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించే విధంగా నిర్మాణం చేయాలని కోరారు.
   రైల్వే స్టేషన్ పక్కన ముళ్ళ కంపలను తొలగించి దాదాపుగా 100 ఎకరాలు ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ పరిధిలో ఏదైనా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు.
 డబుల్ రైళ్లను మహబూబ్నగర్ నుండి డోన్ వరకు చెప్పడానికి 12 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ధన్యవాదాలు.    రైల్వే అధికారులు ఈ పునర్నిర్మాణం రైల్వే స్టేషన్ ను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు.   ఎంపీ రాములు  మాట్లాడుతూ....
గద్వాల నియోజకవర్గం ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం గతంలో ఈ ప్రాంతం రాజులు పరిపాలించడం జరిగింది. మూడు రాష్ట్రాలకు ప్రసిద్ధి చెందిన గద్వాల ఇటు ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక తెలంగాణలో మూడు రాష్ట్రాలకు ప్రసిద్ధి చెందిన నడిగడ్డ ప్రాంతమైన గద్వాలకు రైల్వేస్టేషన్ అభివృద్ధికి అమృత్ భారత్ పథకంలో భాగంగా 9.49 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి కేంద్ర రైల్వే శాఖ మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు.
నన్ను ఎంపీగా గెలిపించి ఐదు సంవత్సరాలు లో రెండు ఏళ్ళు కరోనాలో మూడేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కృషి చేయడం జరిగింది. 
రైల్వే స్టేషన్లో పునర్నిర్మాణం  చేయాలని ప్రధాని చర్య తీసుకోవడం ద్వారా అధికారులు వెంటనే అన్ని రంగులతో అన్ని రకాల సౌకర్యాలతో ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా వారు సురక్షితంగా ప్రయాణం చేసే విధంగా కృషి చేయాలని సూచించారు.  హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లడానికి రోడ్డు లను, నాలుగు లైన్లు ఉన్నా ఆరు లైన్లను గా మంజూరు కావడం జరిగింది.   ఎమ్మెల్యే  ఢిల్లీకి రావడం జరిగింది .ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కమిషనర్లను కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఈ ప్రాంతంలో జరగవలసిన అభివృద్ధి అనేకమైన విషయాలపై ఎమ్మెల్యే  కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
 
      ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామన్ గౌడు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, ఎంపీపీలు ప్రతాప్ గౌడ్,విజయ్ రాజారెడ్డి, కౌన్సిలర్స్ మురళి నాగిరెడ్డి నరహరి శ్రీనివాసులు, శ్రీను, కృష్ణ, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు, ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి ఉపాధ్యక్షులు ధర్మ నాయుడు , ఆలయం కమిటీ డైరెక్టర్ అభిలాష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోటేష్ నాగులు యాదవ్, జనార్దన్ రెడ్డి, రామకృష్ణ శెట్టి, , సుధాకర్, బంగి సుదర్శన్,కురుమన్న, లక్ష్మీకాంత్ రెడ్డి , దేవేందర్,  కృష్ణ, వీరేష్, చిన్న, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333