తొర్రూరు డిపో నుండి శ్రీశైలానికి బస్సు సౌకర్యం కల్పించాలి

May 31, 2026 - 21:56
 0  5
తొర్రూరు డిపో నుండి శ్రీశైలానికి బస్సు సౌకర్యం కల్పించాలి

తిరుమలగిరి 01 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకట్టిన మల్లికార్జున స్వామి శక్తి పీఠంలో ఒకటైన బ్రమరాంభికాదేది కొలువైన పరమ పవిత్రమైన ప్యూక్షేత్రం శ్రీశైలం. నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం తరలి వెళుతుంటారు. తెలంగాణా లోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తొరూర్ డిపో నుండి శ్రీశైలానికి నేరుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో పరిసర . మండలాల ప్రజలు, ప్రమాణికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

తొర్రూరు బస్సు డిపో నుండి ఎక్స్ప్రెస్ డిలాక్స్ బస్సులను ప్రారంబిస్తే తోరూర్ తో పాటు పెద్ద వంగర, కొడకండ్ల, అర్వపల్లి తుంగతూర్తి, తిరుమలగిరి , దేవరుప్పల, నాగారం, మోత్కూర్, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు, మోతె చాడ మండలాలకు చెందిన ప్రజలకు భక్తులకు సౌకర్యంగా ఉంటుంది ఆర్టీసీ. సంస్థకు ఆదాయం కూడా పెరుగుతుంది.

తొర్రూర్ డిపో నుండి బస్సు లేకపోవడంతో ప్రమాణికులు, భక్తులు రెండు లేదా మూడు మార్లు బస్సులు మారుతూ ముఖ్యంగా వృద్దులు, మహిళలు, చిన్నపిల్లలతో ప్రయాణించాలంటే పలు కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రత్యేక బస్సుసేవ ప్రారంభమైతే ప్రయాణం సమయం తగ్గటంతో పాటు, సౌకర్యం, ఖర్చు పరంగా కూడా ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఈ బస్సు సేవ 14 మండలాల భక్తులకు నేరుగా ఉపయోగ పడేల ఉంటుందని, ముఖ్యంగా పండగలు, శివరాణ కార్తీక మాసం వంటి రద్దీ కాలాల్లో భక్తుల రద్దీని సమర్ధవంతంగా నియంత్రించ వచ్చు . 14 మండలాల ప్రజలు భక్తులు ఒకే వాహనంలో ప్రయాణించే అవకాశం ఉండి ఆలయ దర్శనం సులభ మవుతుంది.ప్రత్యేక బస్సు అందుబాటులో లేకపోవడంతో భక్తులు ప్రవేటు ట్రావెల్స్ ను, టాక్సీలను ఆశ్రయించ వలసి వస్తుంది.దీనిని ఆసరా చేసుకొని ప్రవేటు వాహన. వాహన దారులు బారీగా చార్జీలు వసూలు చేస్తూ భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.

దూర ప్రాంతాల నుండి వచ్చే వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో బస్టాండు లో గంటల తరబడి ఎదురు చూస్తూ వేచి ఉండాల్సి వస్తుంది. సరియైన ప్రత్యామ్నాయం లేక నానా అవస్థలు పడుతున్నారు శ్రీశైలం రూటు అనేది ఎప్పుడూ ప్రయాణికులు, భక్తులతో రద్దీగా ఉండే లాభదాయకమైన, ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా కూడా ఈ ప్రాంతానికి ఆదరణ ఉంది. ఇలాంటి కీలకమైన రూటులో బస్సు సర్వీసును నిర్వహించక పోవడం విచారకరం. దీని వెనకాల ఉన్ని కారణాలు ఎవరికి అర్ధం కావడం లేదు. ఇది కేవలం భక్తులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా రవాణా సంస్థకు వచ్చే ఆదాయానికి కూడా గండి కొడుతుంది.

స్థానిక ప్రజాప్రతినిధులు, RTC ఉన్నతాదికారులు, భక్త సంఘాలు రవాణా సంస్థ దృష్టికి తీసుకెళ్ళి శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు బస్సులను ఏర్పాటు చేసి, ప్రజా రవాణా వ్యవస్థను నమ్ముకున్న సాదారణ భక్తులు, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున. తక్షణమే శ్రీశైలంకు వెళ్లే బస్సు సౌకర్యం కల్పించాలని 14 మండలాల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి